Yuzvendra Chahal: "నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు"... టీమిండియా క్రికెటర్ చాహల్ ఆసక్తికర పోస్ట్!

- గత కొంతకాలంగా చాహల్, ధనశ్రీ వర్మ విడాకులపై నెట్టింట జోరుగా ప్రచారం
- ఈ క్రమంలో వాలంటైన్స్ డే నాడు సోషల్ మీడియా వేదికగా క్రికెటర్ ఆసక్తికర పోస్టు
- ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న పోస్టు
- ఇది తప్పకుండా అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిందేనని ఫ్యాన్స్ కామెంట్
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులకు రెడీ అవుతున్నారంటూ గత కొంతకాలంగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల చాహల్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి భార్య ఫొటోలను తొలగించడంతో ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్లయింది. అయితే, ప్రేమికుల రోజు సందర్భంగా చాహల్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
"నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు... ఇతరులు నీ జీవితాన్ని మార్చేందుకు అనుమతించకు" అని చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. దాంతో ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక చాహల్ ఈ పోస్టు దేనిగురించి పెట్టాడనే విషయంలో క్లారిటీ లేదు. అయితే, చాహల్ ఫ్యాన్స్ మాత్రం ఇది తప్పకుండా అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిందేనని వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, ఇప్పటికే చాహల్, ధనశ్రీ ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో ఈ దంపతుల విడాకులపై జోరుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇలా తమ విడాకులపై ఊహాగానాలు పెరగడంతో చాహల్ స్పందించాడు. "నెట్టింట వస్తున్న వార్తలు నిజం కావచ్చు... కాకపోవచ్చు" అని పోస్టు చేశాడు.