Taman: బాయ్స్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఓ సినిమాలో నటిస్తున్న తమన్

- 23 ఏళ్ల క్రితం బాయ్స్ మూవీలో నటించిన తమన్
- ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న వైనం
- అథర్వ్ మురళి తాజా చిత్రంలో నటిస్తున్న తమన్
టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న తమన్ మళ్లీ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవ్వడానికి ముందే తమన్ నటుడిగా కనిపించారు. 23 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రంలో తమన్ నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు తమిళ యంగ్ హీరో అథర్వ మురళీ సినిమాలో ఆయన నటించబోతున్నారు.
అథర్వ్ మురళీ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'ఇదయమ్ మురళీ' ప్రోమోను నిన్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తే ఈ చిత్రంలో తమన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న తమన్ వెండితెరపై చక్కగా కనిపించాడని సినీ వర్గాల టాక్.
తనదైన డైలాగ్ డెలివరీతో తమన్ ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఈ మూవీలో తమన్ నటిస్తూనే సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇక సంగీత దర్శకుడిగా తమన్ .. డాకు మహారాజ్ తో తన సత్తా ఏంటో చూపించారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2, పవన్ కల్యాణ్ OG సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.