Chandrababu: ఇండియా టుడే సర్వేలో సీఎం చంద్రబాబుకు 4వ స్థానం: మంత్రి పార్థసారథి

- జాతీయస్థాయిలో ఉత్తమ సీఎం సర్వే
- చంద్రబాబు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారన్న పార్థసారథి
- చంద్రబాబుపై పెట్టుబడిదారులకు అపారమైన నమ్మకం అని వెల్లడి
ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆసక్తికర అంశం వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంల జాబితాలో చంద్రబాబుకు 4వ స్థానం లభించిందని తెలిపారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించిందని అన్నారు.
అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పార్థసారథి స్పష్టం చేశారు. చంద్రబాబుపై పెట్టుబడిదారులకు అపారమైన నమ్మకం అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు.
యువతకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పార్థసారథి వివరించారు.