Gold: రూ.89 వేలకు చేరిన బంగారం ధర... లక్ష రూపాయలు దాటిన వెండి

- తులం బంగారం రూ.1,300 పెరిగి రూ.89,000కు చేరిన పసిడి
- ఈరోజు రూ.2 వేలు పెరిగిన కిలో వెండి
- అంతర్జాతీయ మార్కెట్‌లో 2,960 డాలర్లు పలికిన ఔన్స్ బంగారం
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,300 పెరిగి రూ.89,400కు చేరింది. వెండి కిలో ధర లక్ష రూపాయలు దాటింది. నిన్న వెండి కిలో రూ.98 వేలుగా ఉంది. ఈరోజు రూ.2 వేలు పెరిగి నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3 వేల డాలర్లకు చేరువైంది. ఈరోజు అత్యధికంగా 2,960 డాలర్లు పలికింది. వెండి ఔన్సు 34 డాలర్లకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి వస్తున్న ప్రకటనలు మార్కెట్‌ను అనిశ్చితికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.