Telangana: సహకార సంఘాల కాలపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

- సహకార సంఘాల కాలపరిమితిని పెంచిన ప్రభుత్వం
- 904 సహకార సంఘాల కాలపరిమితి పెంపు
- తొమ్మిది డీసీసీబీ చైర్మన్ల పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సహకార సంఘాల కాలపరిమితిని పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 904 సహకార సంఘాల కాలపరిమితిని పెంచింది. తొమ్మిది డీసీసీబీ చైర్మన్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పాలకవర్గ పదవీ కాలానికి ఆరు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రేపటికి గడువు ముగుస్తున్నప్పటికీ తెలంగాణ సహకార సంఘాల రిజిస్ట్రార్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.