Pooja Khedkar: పూజా ఖేద్క‌ర్‌ కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

Supreme Court orders not to arrest Pooja Khedkar till March 17

  • 2022 యూపీఎస్సీ పరీక్షల్లో తప్పుడు ధృవపత్రాలను సమర్పించిన పూజ
  • విచారణను ఎదుర్కొనేందుకు పూజ సిద్దంగా ఉన్నారన్న సీనియల్ న్యాయవాది లూథ్రా
  • విచారణపై వివరాలు ఇచ్చేందుకు సమయం కోరిన అదనపు సొలిసిటర్ జనరల్

ఐఏఎస్ ట్రైనీ అధికారి పూజా ఖేద్కర్ కు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది. మార్చి 17 వరకు ఆమెను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు సహకరించాలని పూజకు సూచించింది. 2022 యూపీఎస్సీ పరీక్షల్లో పూజా ఖేద్కర్ తప్పుడు కుల, అంగవైకల్య ధృవపత్రాలను సమర్పించి ఐఏఎస్ కు ఎంపికైన సంగతి తెలిసిందే. 

జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ కేసును విచారించింది. పూజ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. విచారణకు రావాలని పూజను పోలీసులు పిలవడం లేదని... విచారణను ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని కోర్టుకు లూథ్రా తెలిపారు. విచారణపై వివరాలు ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టును కోరారు. దీంతో, మూడు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ను కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News