Chandrababu: స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటివాళ్లనైనా ముంచేస్తారు: సీఎం చంద్రబాబు

- అమరావతిలో టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
- ఎమ్మెల్సీ ఎన్నికలు, టీడీపీ కార్యకర్తల సంక్షేమం తదితర అంశాలపై చర్చ
- నేరస్తులు రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని వెల్లడి
సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో అమరావతిలో సమావేశం అయ్యారు. నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, అశోక్ బాబు, కేఎస్ జవహర్ లతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, టీడీపీ కార్యకర్తల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేరస్తులు రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని చంపి ఇప్పుడు కొత్తదారులు వెదుకుతున్నారని విమర్శించారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజమని నమ్మించాలనేది వారి తాపత్రయం అని వివరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటివారినైనా ముంచేస్తారని, నా దళితులు అంటూనే వారిని నట్టేట ముంచే రకాలు వాళ్లు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
దాడులు, విధ్వంసాలు, హత్యలు అటవిక పాలనలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. తాము ప్రజాస్వామ్యవాదులం అని, తాము చట్టబద్ధంగానే పరిపాలన సాగిస్తామని అన్నారు.