Illegal Immigrants: మరో 200 మంది అక్రమ వలసదారులను భారత్ కు తిప్పి పంపిస్తున్న అమెరికా

- అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం
- గొలుసులతో బంధించి మరీ స్వదేశాలకు పంపిస్తున్న అమెరికా
- ఇటీవల 104 మందితో భారత్ వచ్చిన అమెరికా విమానం
- ఈ నెల 15, 16 తేదీల్లో భారత్ చేరుకోనున్న మరో రెండు విమానాలు
అమెరికాలో అక్రమ వలసదారుల అంశంపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గొలుసులతో బంధించి మరీ అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్నారు. కొన్నిరోజుల కిందటే 104 మంది భారతీయులను కూడా అమెరికా ప్రభుత్వం సైనిక రవాణా విమానంలో పంపించి వేసింది.
తాజాగా, మరో 200 మంది అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం భారత్ కు పంపించనుంది. అక్రమ వలసదారులతో కూడిన రెండు విమానాలు భారత్ చేరుకోనున్నాయి. ఈ నెల 15న ఒక విమానం, ఈ నెల16న మరో విమానం భారత్ చేరుకుంటాయి.