Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి గన్ మన్ సస్పెన్షన్

Minister Sandhya Rani gunman suspended

  • 30 బుల్లెట్లు ఉన్న మేగజీన్ ను పోగొట్టుకున్న గన్ మన్ రమణ
  • సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా ఎస్పీ
  • మేగజీన్ ఉన్న బ్యాగ్ కోసం గాలిస్తున్న పోలీసులు

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గన్ మన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే... రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళుతుండగా ఆయన బ్యాగ్ మాయమయింది. ఆ బ్యాగ్ లో 30 బుల్లెట్లు ఉండే మేగజీన్ ఉండడంతో... ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. రమణపై సస్సెన్షన్ వేటు వేశారు.

సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనంలో రమణ రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం తన రైఫిల్ ను జిల్లా కేంద్రంలో అప్పగించారు. అయితే బుల్లెట్లు ఉన్న మేగజీన్ ను మాత్రం అప్పగించలేదు. 

విజయనగరం సమీప గ్రామానికి చెందిన రమణ... వ్యక్తిగత పనులపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గల డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లారు. ఆ సమయలో తన చేతిలో ఉన్న సంచిని కిందపెట్టి, పనిలో పడిపోయారు. ఆ తర్వాత చూస్తే సంచి కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాగ్ కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాగ్ ఆచూకీ లభించలేదు.

  • Loading...

More Telugu News