VHP: వాలెంటైన్స్ డే నేపథ్యంలో వీహెచ్ పీ ప్రకటన

- ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు మాత్రమే కాదన్న వీహెచ్ పీ నేత
- పుల్వామా అమరుల సంస్మరణ దినోత్సవం అని వెల్లడి
- కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతున్నట్టు ప్రకటన
వాలెంటైన్స్ డే నేపథ్యంలో వీహెచ్ పీ ఓ ప్రకటన చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ అంటే వాలెంటైన్స్ డే మాత్రమే కాదని, పుల్వామా అమర జవాన్ల సంస్మరణ దినోత్సవం కూడా అని వీహెచ్ పీ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించే రోజుగా ఫిబ్రవరి 14వ తేదీని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రేమ ముసుగులో అనైతిక చర్యలకు పాల్పడుతున్న యువత ఇకనైనా మేలుకోవాలని, విజ్ఞతతో వ్యవహారించాలని బాలస్వామి స్పష్టం చేశారు. ఇవాళ పుల్వామా అమరుల ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంస్మరణ ర్యాలీ చేపడుతున్నామని వెల్లడించారు.