Hari Hara Veera Mallu: ప్రేమికుల రోజు స్పెషల్... 'హరిహర వీరమల్లు' నుంచి బిగ్ అప్‌డేట్

- పవన్ ఫ్యాన్స్ కు లవర్స్ డే ట్రీట్ ఇచ్చిన మేకర్స్
- సినిమాలోని సెకండ్ సింగిల్ విడుదల తేదీ ప్రకటన
- ఈ నెల 24న 'కొల్లగొట్టిందిరో' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించారు. 'కొల్లగొట్టిందిరో' అంటూ సాగే... రొమాంటిక్ సాంగ్ ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ మేరకు హీరోహీరోయిన్లు పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ లతో కూడిన రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నిధి అగర్వాల్ ను పవన్ పొగుడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ వాలంటైన్స్ డే ట్రీట్ ఇచ్చారంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, హరిహర వీరమల్లు చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర సగభాగానికి పైగా దర్శకత్వం వహించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.