Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు

- రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్
- ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే రాష్ట్రపతి పాలన
- జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్
మణిపూర్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం కొద్ది రోజుల వ్యవధిలోనే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.
మణిపూర్ గవర్నర్ సమర్పించిన నివేదికతో పాటు ఇతర నివేదికల సమాచారాన్ని పరిశీలించిన మీదట అక్కడ రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగించే పరిస్థితి లేదని అంచనాకు వచ్చామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలతో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల్లో పేర్కొన్నట్లు వెల్లడించింది.