Nirmala Sitharaman: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Nirmala Sitaraman on Telangana economic situation

  • విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందన్న నిర్మలా సీతారామన్
  • ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందన్న కేంద్ర ఆర్థిక మంత్రి
  • బడ్జెట్‍‌లో తెలంగాణకు అన్యాయం జరగలేదని స్పష్టీకరణ

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందని, ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు.

రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సరైన ప్రాధాన్యత దక్కిందని ఆమె అన్నారు. బడ్జెట్‌లో బీహార్‌తో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడం సరికాదని ఆమె అన్నారు. తెలంగాణకు కూడా నిధులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చామని ఆమె వెల్లడించారు. 

దివంగత ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్ నుండి పోటీ చేసి గెలిచారని, కానీ అక్కడ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేసింది ప్రధాని నరేంద్రమోదీ అని ఆమె అన్నారు. సమ్మక్క సారక్క, రామగుండం ప్లాంట్, పసుపు బోర్డు తెలంగాణకు ప్రాధాన్యతాంశాలని ఆమె పేర్కొన్నారు. పసుపు బోర్డును ఇచ్చింది ప్రధాని మోదీయే అని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News