Chinthamaneni Prabhakar: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై హత్యాయత్నం

- నిన్న రాత్రి ఓ వివాహానికి వెళ్లిన చింతమనేని
- ఆయన వాహనానికి తన వాహనం అడ్డు పెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
- గన్ మెన్ గన్ లాక్కుని కాల్పులకు యత్నించారన్న టీడీపీ శ్రేణులు
టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యయత్నం జరిగింది. దీంతో, దెందులూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే... నిన్న రాత్రి వట్లూరులోని ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న చింతమనేని వాహనానికి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తన వాహనాన్ని అడ్డు పెట్టారు. వాహనం పక్కకు తీయాలని చింతమనేని వారిని కోరారు. ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది.
పక్కా పథకం ప్రకారమే ప్రభాకర్ తో వాగ్వాదానికి దిగారని... ఆయన డ్రైవర్, గన్ మెన్ పై వైసీపీ అల్లరిమూకలు ఐరన్ రాడ్ తో దాడికి యత్నించాయని టీడీపీ నేతలు చెప్పారు. గన్ మెన్ నుంచి గన్ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించారని తెలిపారు. అయితే చింతమనేని వ్యక్తిగత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కోవడంతో దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు.