Rajat Patidar: ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు!

- ఆర్‌సీబీ కొత్త సారథిగా రజత్ పటీదార్
- గత సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్
- ఆర్‌సీబీ పగ్గాలు తిరిగి కోహ్లీ చేపడతారని జోరుగా ప్రచారం
- కెప్టెన్సీపై ఆసక్తి చూపని కోహ్లీ
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాంలెజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ జట్టుకు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది. యువ ఆటగాడు రజత్ పటీదార్ ను సారథిగా ప్రకటించింది. దీంతో వచ్చే సీజన్ లో ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగనుంది. గత సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ ను ఈసారి వేలంలో బెంగళూరు వదిలేసిన విషయం తెలిసిందే. దాంతో ఆర్‌సీబీ పగ్గాలు తిరిగి విరాట్ కోహ్లీ చేపడతారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ, అతడు కెప్టెన్సీపై ఆసక్తి చూపించకపోవడంతో రజత్ కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ కూడా రేసులో నిలిచినప్పటికీ జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రజత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టుగా ఆర్‌సీబీ ఉన్న విషయం తెలిసిందే. ప్రతిసారి భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. నిరాశపరచడం చేస్తుందా టీమ్. దీంతో ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే భారీ మార్పులతో ఐపీఎల్ 2025 సీజన్ లో బరిలోకి దిగుతోంది.