Nidhhi Agerwal: పవన్ లో ఆ లక్షణం నాకు బాగా నచ్చింది.. నేను కూడా అలవాటు చేసుకోవాలి: నిధి అగర్వాల్

- పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో కథానాయికగా నిధి అగర్వాల్
- అలాగే ప్రభాస్ సరసన 'రాజాసాబ్'లో నటిస్తున్న బ్యూటీ
- పవన్ సెట్స్ లో ఉంటే ఎంతో ఏకాగ్రతతో ఉంటారని, యాక్షన్ చెప్పగానే లీనమవుతారని వ్యాఖ్య
- కేవలం తన సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారన్న నిధి
- పవన్ నుంచి ఈ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకోవాలన్న హీరోయిన్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ కథానాయికగా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న 'రాజాసాబ్'లో కూడా ఆమె నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఇద్దరు స్టార్ల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్, ప్రభాస్ ఇద్దరూ తనను ఎంతో ప్రోత్సహించారని నిధి అగర్వాల్ తెలిపారు. పవన్ సెట్స్ లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారని, యాక్షన్ చెప్పగానే పూర్తిగా లీనమవుతారని ఆమె పేర్కొన్నారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరని, తన సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారని చెప్పారు.
పవన్ నుంచి ఈ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకోవాలని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ మాత్రం సెట్స్ లో ఎప్పుడూ ఫన్నీగా ఉంటారందీ బ్యూటీ. 'హరిహర వీరమల్లు', 'రాజాసాబ్' మూవీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.