maha kumbh: కుంభమేళాలో సూపర్ చార్జింగ్... గంటకు వెయ్యి రూపాయల సంపాదన?

man earns thousand rupees per hour by providing charging for mobiles in maha kumbh

  • ప్రయాగ్‌రాజ్‌లో మొబైల్ చార్జింగ్ వ్యాపారం
  • ఓ యువకుడు గంటకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • అది ఫేక్ వీడియోగా పేర్కొన్న ఓ నెటిజన్  

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వెళుతూ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ వివిధ రకాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్‌లో దాదాపు రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. స్థానికులు, వ్యాపార పరంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడ తమ తెలివితేటలతో వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇదే క్రమంలో వేప పుల్లలు అమ్ముకునే ఒక వ్యక్తి కేవలం ఐదు రోజుల వ్యవధిలో రూ.40వేలు సంపాదించినట్లు గతంలో వార్తలు షికారు చేశాయి. 

తాజాగా అలాంటిదే మరో వ్యవహారం బయటకు వచ్చి హాట్ టాపిక్‌గా మారింది. అదేమిటంటే.. కుంభమేళాకు హజరయ్యే భక్తుల మొబైల్ ఫోన్లకు చార్జింగ్ సౌకర్యం కల్పిస్తూ మరో వ్యక్తి బాగా సంపాదించాడని, ఒక మొబైల్‌కు గంట సేపు చార్జ్ చేసినందుకు రూ.50 ల చొప్పున వసూలు చేస్తున్నాడని, అలా గంటకు ఒకేసారి 20 మొబైల్స్ కు చార్జింగ్ పెడుతూ గంటకు వెయ్యి రూపాయల చొప్పున సంపాదిస్తున్నాడని ప్రచారం జరిగింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఈ వీడియోను దాదాపు 70 లక్షల మందికి పైగా వీక్షించగా, 6.5 లక్షలకు మించి లైక్స్ వచ్చాయి. అయితే, ఈ వీడియో ఫేక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. మరి కొందరు ఈ యువకుడి తెలివిని ప్రశంసిస్తున్నారు. అది పూర్తిగా అబద్ధమని, కుంభమేళాలో ఉచిత మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ వీడియో ఫేక్ అని స్పష్టం చేశాడు. అలా అయితే ఒక రోజులో లక్ష రూపాయలకు పైగా సంపాదించవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేశారు. 

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అనేక ఫేక్ వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏది అసలో, ఏది నకిలీయో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతున్నారు.      

  • Loading...

More Telugu News