Rs 50: మార్కెట్లోకి త్వరలో కొత్త రూ.50 నోట్లు

RBI will release new Rs 50 currency notes

  • మహాత్మా గాంధీ సిరీస్ లో కొత్త రూ.50 నోట్లు
  • ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో నోట్లు
  • పాత నోట్లు చెల్లుబాటు అవుతాయన్న ఆర్బీఐ

త్వరలోనే భారత్ లో సరికొత్త 50 రూపాయల నోట్లు చలామణీలోకి రానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సన్నాహాలు చేస్తోంది. ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన ఈ కొత్త రూ.50 నోట్లను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. 

సంజయ్ మల్హోత్రా సంతకం కూడిన రూ.50 నోట్లు మహాత్మా గాంధీ సిరీస్ లో రానున్నాయి. కొత్త నోట్లు వచ్చినా, ఇప్పటికే అమల్లో ఉన్న పాత రూ.50 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News