Muslim Employees: రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Govt conveys good news for Muslim employees

  • త్వరలోనే రంజాన్ మాసం ప్రారంభం
  • ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వం
  • విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి
  • అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వులు

ముస్లింలకు రంజాన్ మాసం పరమ పవిత్రమైనది. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటూ దీక్ష ఆచరిస్తారు. మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. త్వరలోనే రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 

ఉద్యోగ విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. మార్చి 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గంట ముందుగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. అన్ని రకాల ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులకు ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News