Rangarajan: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌కు కూనంనేని సాంబశివరావు పరామర్శ

- రంగరాజన్‌కు ధైర్యం చెప్పిన కూనంనేని సాంబశివరావు
- అందరం అండగా ఉన్నామని, ఆందోళన అవసరం లేదన్న ఎమ్మెల్యే
- ఈ దాడి ఘటనతో మీ మంచి పనులు వెలుగులోకి వచ్చాయన్న కూనంనేని
చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి ఆయనపై దాడి చేసిన విషయం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు రంగరాజన్‌ను పరామర్శిస్తున్నారు.
రంగరాజన్‌కు కూనంనేని సాంబశివరావు ధైర్యం చెప్పారు. అందరం అండగా ఉన్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ దాడితో... దాడి చేసిన వారి దీనత్వం, మీ ఔన్నత్యం అందరికీ అర్థమైందని రంగరాజన్‌తో అన్నారు. ఈ దాడి నేపథ్యంలో మీరు అంతకుముందు చేసిన మంచి పనులు వెలుగులోకి వచ్చాయన్నారు.
రామరాజ్యం ఆర్మీ పేరుతో దాడికి పాల్పడుతున్న వారు నిజమైన రామభక్తులు కాబోరన్నారు. వారు సూడో భక్తులు అని విమర్శించారు. కానీ రంగరాజన్ నిజమైన రామభక్తులని, దైవభక్తులని ఆయన అన్నారు. రంగరాజన్ నిజమైన హిందువు, నిజమైన దేశభక్తుడు అన్నారు.