Auto: ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆటో డ్రైవర్ల జేఏసీ

Auto drivers jac to protest on promises

  • హామీలు అమలు చేయనందుకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్న జేఏసీ
  • ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్న జేఏసీ
  • ఈ నెల 24న రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి

ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, కానీ దీనిని నెరవేర్చడం లేదని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ మండిపడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు జేఏసీ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలతో పాటు 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని జేఏసీ కన్వీనర్ వెంకటేశ్ తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక, వారిని విస్మరించిందని అన్నారు.

తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చామని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి పిలిపించుకుని చర్చించారని, నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలు ఇస్తామన్న ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News