Sensex: వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- ఉదయం 900 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
- మధ్యాహ్నం కాస్త పుంజుకున్న మార్కెట్లు
- 122 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిసింది. ఉదయం ఒక సమయంలో దాదాపు 900 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత బాగా పుంజుకుంది. దీంతో స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఈరోజు సెన్సెక్స్ ఒక సమయంలో 73 వేల దిగువకు, నిఫ్టీ 23 వేల దిగువకు చేరుకున్నాయి. ఆ తర్వాత పుంజుకోవడంతో ఆ మార్క్ పైన ముగిశాయి.
రిలయన్స్, మహింద్రా అండ్ మహింద్రా, ఐటీసీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, కొటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు సూచీలకు అండగా నిలిచాయి. సెన్సెక్స్ 122 పాయింట్లు నష్టపోయి 76,171 వద్ద... నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 23,045 వద్ద స్థిరపడ్డాయి.
సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంకు, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి.