Tandel Movie: పైరసీ భూతం... మరో ఆర్టీసీ బస్సులో 'తండేల్' ప్రదర్శన

Tandel film played another time in APSRTC

  • రెండు రోజుల క్రితం పలాస నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో సినిమా ప్రదర్శన
  • నిన్న విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతున్న బస్సులో సినిమా ప్రదర్శన
  • విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన బన్నీ వాసు

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన 'తండేల్' సినిమా సూపర్ హిట్ అయింది. రూ. 100 కోట్ల క్లబ్ వైపుగా ఈ మూవీ దూసుకుపోతోంది. మరోవైపు, ఈ సినిమాను పైరసీ భూతం వదలడం లేదు. విడుదలైన రెండు రోజులకే ఈ సినిమాను పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఆర్టీసీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై విచారణ చేపట్టాలని ఆర్టీసీ ఛైర్మన్ ఆదేశించారు.

అయినా తాజాగా మరోసారి ఆర్టీసి బస్సులో 'తండేల్' సినిమాను ప్రదర్శించారు. నిన్న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఈ సినిమా వేశారు. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా వెల్లడించారు. 'తండేల్' సినిమాను ప్రదర్శిస్తున్న వీడియోను, బస్సు టికెట్ ను షేర్ చేశారు.

  • Loading...

More Telugu News