Pawan Kalyan: కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం జనసేనాని కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక మూడు రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు.