Naga Chaitanya: నాగచైతన్యతో మరో సినిమా అనౌన్స్ చేసిన తండేల్ దర్శకుడు

Chandu Mondeti announces anaother movie with Naga Chaitanya

  • నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్
  • చందు మొండేటి దర్శకత్వంలో చిత్రం
  • ఫిబ్రవరి 7న రిలీజ్
  • బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం
  • నేడు హైదరాబాదులో సక్సెస్ మీట్

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. నేడు ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

కాగా, దర్శకుడు చందు మొండేటి ఈ సందర్భంగా నాగచైతన్యతో మరో సినిమా అనౌన్స్ చేశారు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని నాగచైతన్యతో తెరకెక్కిస్తానని ప్రకటించారు. 

"శోభిత గారూ... మీరు తెలుగు చక్కగా మాట్లాడతారు... ఆ తెలుగును మా హీరోకి (నాగచైతన్యకి) కూడా బదిలీ చేయండి. భవిష్యత్తులో మేం చారిత్రాత్మక చిత్రం చేయబోతున్నాం. నాడు ఏఎన్నార్ నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ కు తగినట్టుగా తెరకెక్కిస్తాం" అని చందు మొండేటి వివరించారు. ఈ సినిమాలో నాగచైతన్య నటన చూసిన వారు మరో ఏఎన్నార్ అనుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News