Telangana: తెలంగాణలో పెరిగిన బీర్ల ధరలు... ఏ బీరు ఎంత పెరిగింది?

Telangana hikes beer price by 15 percent

  • 15 శాతం పెరిగిన బీర్ల ధరలు
  • నేటి నుండే అమల్లోకి పెరిగిన ధరలు
  • బీర్ల ధరల పెంపుతో ఏడాదికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా

తెలంగాణలో బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలు నేటి నుండి అమలులోకి వస్తాయని ప్రకటించింది. బీర్ల ధరల పెరుగుదలతో ప్రభుత్వానికి రూ.700 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.

ధరలు పెరగడంతో తెలంగాణలో వివిధ బీర్ల ధరలు ఇలా ఉండనున్నాయి. లైట్ బీరు ఇప్పటి వరకు రూ.150 ఉండగా రూ.172కు పెరిగింది. కింగ్ ఫిషర్ ప్రీమియం రూ.160 నుండి రూ.184కు, బడ్వైజర్ లైట్ రూ.210 నుండి రూ.241.5కి, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ రూ.220 నుండి రూ.253కు, బడ్వైజర్ మ్యాగ్నం రూ.220 నుండి రూ.253, టుబోర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుండి రూ.276కు పెరిగాయి.

  • Loading...

More Telugu News