Sensex: ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు... కారణాలివే

Investors lose Rs 9 lakh crore as Sensex crashes over 1000 points

  • రూ.9.3 లక్షల కోట్లు ఆవిరి కావడంతో 408 లక్షల కోట్లకు తగ్గిన మార్కెట్ క్యాప్
  • మార్కెట్ నష్టాలకు ట్రంప్ టారిఫ్ ప్రభావంతో పాటు పలు కారణాలు
  • అమ్మకాలకు మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు

దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఈరోజు 1,000 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ సుమారు రూ.9.3 లక్షల కోట్లు ఆవిరై రూ.408.52 లక్షల కోట్లకు తగ్గింది. మార్కెట్ నష్టాలకు వివిధ కారణాలు ఉన్నాయి.

స్టీల్, అల్యూమినియంపై అమెరికా టారిఫ్ పెంపు, ఎఫ్ఐఐ అమ్మకాల వెల్లువ, రూపాయి పతనం వంటి పలు కారణాలు ఇన్వెస్టర్ల నష్టానికి దారితీశాయి. స్టీల్, అల్యూమినియంపై టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమపై సుంకాలు వేస్తున్న వారిపై అధిక సుంకాలు వేస్తామని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఇది అంతర్జాతీయ మార్కెట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫిబ్రవరి 10 నుండి రూ.2,463 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డాలర్ మారకంతో రూపాయి బలహీనపడుతోంది. ఇది కూడా ఎఫ్ఐఐ అమ్మకాలకు కారణంగా కనిపిస్తోంది. బాండ్ యీల్డ్స్ పెరుగుతుండటంతో భారత్‌లో విక్రయించి బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 4.495 శాతం పెరిగాయి.

  • Loading...

More Telugu News