JEE Main: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల... ఇద్దరు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్

JEE Main 1st session results released

  • గత నెల 22 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు
  • 14 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్
  • ఏపీకి చెందిన మనోజ్ఞ, తెలంగాణకు చెందిన బనిబ్రతకు 100 పర్సంటైల్

అఖిల భారత స్థాయిలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు. అమ్మాయిల విభాగంలో ఏపీకి చెందిన గుత్తికొండ మనోజ్ఞకు 100 పర్సంటైల్ వచ్చింది. తెలంగాణ విద్యార్థి బనిబ్రత మజీ కూడా 100 పర్సంటైల్ సాధించాడు. మొదటి సెషన్ ఫలితాలకు https://jeemain.nta.nic.in/ వెబ్ పోర్టల్ ను సందర్శించాలి. 

ఈ ఏడాది జనవరి 22 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష జరగనుంది. 

కాగా, రెండు సెషన్ల నుంచి 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేస్తారు.

  • Loading...

More Telugu News