Stock Market: వాణిజ్య యుద్ధ భయాలు... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses

  • స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానన్న ట్రంప్
  • 1,018 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 309 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. భారీ నష్టాలను చవిచూశాయి. వాణిజ్య యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,018 పాయింట్లు నష్టపోయి 76,293కి పడిపోయింది. నిఫ్టీ 309 పాయింట్లు కోల్పోయి 23,071కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం భారతి ఎయిల్ టెల్ (0.19%) మాత్రమే లాభాల్లో ముగిసింది. జొమాటో (-5.24%), టాటా స్టీల్ (-2.91%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.68%), ఎల్ అండ్ టీ (-2.65%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.

అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 60 పైసలు మేర బలపడి రూ. 86.85కి చేరుకుంది.

  • Loading...

More Telugu News