Rashmi Gautam: సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యాను: రష్మి

- భుజం సమస్యతో బాధపడుతున్న రష్మి
- సర్జరీ తర్వాత అంతా సెట్ అవుతుందన్న రష్మి
- మళ్లీ తాను డ్యాన్స్ చేయగలుగుతానని వ్యాఖ్య
సినీ నటిగా, బుల్లితెర యాంకర్ గా రష్మీకి ఎంతో ఫాలోయింగ్ ఉంది. యాంకరింగ్ తో పాటు గ్లామర్ షో చేస్తూ కుర్రకారుని రష్మి ఉర్రూతలూగించింది. సోషల్ మీడియాలో కూడా రష్మి ఎంతో యాక్టివ్ ఉంటూ, తన ఫొటోలను షేర్ చేయడంతోపాటు, పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై చిన్న దాడి జరిగినా ఆమె విరుచుకుపడిపోతుంటుంది.
తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలను రష్మి షేర్ చేసింది. తన భుజానికి సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యానని రష్మి తెలిపింది. భుజం సమస్య కారణంగా తనకు ఇష్టమైన డ్యాన్స్ చేయలేకపోతున్నానని చెప్పింది. సర్జరీ తర్వాత అంతా సెట్ అవుతుందని, మళ్లీ తాను డ్యాన్స్ చేయగలుగుతానని తెలిపింది. రష్మి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.