BSNL: బీఎస్ఎన్ఎల్ మ‌రో స‌రికొత్త డేటా ప్లాన్‌.. కేవ‌లం రూ. 1515తో ఏడాదిపాటు ఇంట‌ర్నెట్‌!

BSNL Rs 1515 Recharge Plan offering 2GB Data Per Day for One Year

  • రూ. 1515తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాదిపాటు ప్ర‌తిరోజు 2జీబీ డేటా
  • ఇది కేవ‌లం డేటా వోచ‌ర్ మాత్ర‌మే
  • ఫోన్‌కాల్‌, ఎస్ఎంఎస్ వంటి ఇత‌ర బెనిఫిట్స్ లేవు

ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త‌న వినియోగ‌దారుల కోసం తాజాగా స‌రికొత్త డేటా ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవ‌లం రూ. 1515తో రీఛార్జ్‌ చేసుకుంటే ఏడాదిపాటు ప్ర‌తిరోజు 2జీబీ ఇంట‌ర్నెట్ పొంద‌వ‌చ్చు. ఇది కేవ‌లం డేటా వోచ‌ర్ మాత్ర‌మే. అంటే.. ఫోన్‌కాల్‌, ఎస్ఎంఎస్ వంటి ఇత‌ర బెనిఫిట్స్ ఉండ‌వు. 

ఇక ఈ డేటా ప్లాన్ విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ డేటా బ్రౌజ్ చేసేవారికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. మొత్తానికి బీఎస్ఎన్ఎల్ త‌న కొత్త డేటా ప్లాన్ తో ఇత‌ర ప్రైవేట్ టెలికాం సంస్థ‌ల‌కు గ‌ట్టి స‌వాల్ విసిరింద‌నే చెప్పాలి. ఎందుకంటే ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఏడాది పాటు ప్ర‌తిరోజు 2జీబీ డేటా అందించ‌డం అనేది ప్రైవేట్ టెలికాం సంస్థ‌ల‌కు చాలా క‌ష్ట‌త‌ర‌మైన ప‌ని. 

ఇప్ప‌టికే ఎన్నో చౌక ప్లాన్ల‌తో వినియోగ‌దారుల‌ను త‌న‌వైపు తిప్పుకుంటున్న ఈ ప్ర‌భుత్వ సంస్థ ఇప్పుడు ఈ చీప్ డేటా రీఛార్జ్ ప్లాన్ తో మ‌రింత మంది యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలాఉంటే.. త‌క్కువ ధ‌ర‌ల‌తో కొత్త ప్లాన్ల‌ను తీసుకువ‌స్తున్న‌ బీఎస్ఎన్ఎల్.. కొన్ని పాత ప్లాన్ల‌ను తొలగిస్తోంది. ఇందులో భాగంగా రూ. 201, రూ. 797, రూ. 2999 వంటి రీఛార్జ్ ప్లాను ఈ నెల 10 నుంచి అందుబాటులో ఉండ‌వ‌ని ప్ర‌క‌టించింది.     

More Telugu News