minister gummidi sandhyarani: 1/70 చట్టాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

- అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి
- 1/70 చట్టంపై క్లారిటీ
- గిరిజనులు ఎవరూ ఆందోళన చెందవద్దని వినతి
1/70 చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజన్సీలో 48 గంటల బంద్ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. 1/70 చట్టాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు. అసత్యాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో గిరిజనులెవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.
ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన సూచనలు గిరిజన, ప్రజా సంఘాలలు అగ్రహాన్ని తెప్పించాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీజోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆయన అన్నారు. అయితే అదే జరిగితే 1/70 చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 48 గంటల బంద్ చేస్తున్నారు. ఆదివాసీ, వామపక్ష సంఘాల ఆందోళనకు వైసీపీ మద్దతు తెలిపింది.