software engineer: విజయనగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య

- విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామంలో ఘటన
- ప్రసాద్‌ను హత్య చేసి గ్రామ శివారులో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్న పోలీసులు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన ఘటన విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొనాం ప్రసాద్ (30) ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా ఇంటి వద్దే ఉంటూ పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి గ్రామ శివారులో పడేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.