Narendra Modi: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

- నేటి నుండి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
- 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో మోదీ పర్యటన
- 14వ తేదీ వరకు అమెరికాలో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఆయన నేటి నుండి 14వ తేదీ వరకు ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించనున్నారు. ఫ్రాన్స్‌లో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన నిమిత్తం భారత్ నుండి బయలుదేరిన ప్రధాని ప్యారిస్‌లో దిగారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. ఈరోజు ప్యారిస్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ 12వ తేదీ సాయంత్రానికి అమెరికాకు చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నారు. పలు అంశాలపై వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.