Mithun Reddy: దేశంలోనే అతి పెద్ద స్కామ్ మార్గదర్శి స్కామ్: మిథున్ రెడ్డి

Margadarsi is biggest scam in India says Mithun Reddy

  • మార్గదర్శి స్కామ్ పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్న మిథున్ రెడ్డి
  • రూ. 2,600 కోట్లు డిపాజిట్లుగా సేకరించారన్న వైసీపీ ఎంపీ
  • ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేశారని వ్యాఖ్య

మార్గదర్శి చిట్ ఫండ్స్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో జరిగిన స్కామ్ లలో మార్గదర్శి స్కామ్ అతి పెద్దదని చెప్పారు. లోక్ సభలో బడ్జెట్ పై చర్చలో భాగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇంత పెద్ద స్కామ్ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మిథున్ రెడ్డి అన్నారు. మార్గదర్శి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రూ. 2,600 కోట్లు డిపాజిట్లుగా సేకరిస్తే... ఈడీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూళ్లు చేసిందని చెప్పారు. డిపాజిటర్లకు న్యాయం జరగాలని అన్నారు. 

విద్య, వైద్యంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని విన్నవించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వాల్తేర్ డివిజన్ ను విశాఖ జోన్ లోనే ఉంచాలని కోరారు.

  • Loading...

More Telugu News