Atishi: ఓటమికి అదే కారణం!: రాజీనామా సమర్పించిన సమయంలో అతిశీతో ఢిల్లీ ఎల్జీ కీలక వ్యాఖ్యలు!

Delhi LG To Atishi Over AAP Debacle In Assembly Elections

  • యమునా నది శాపం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిందన్న ఎల్జీ!
  • ఢిల్లీలోని ప్రజా సమస్యలపై హెచ్చరిక చేసినా పట్టించుకోలేదని వ్యాఖ్యలు
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 22 స్థానాలకు పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి నిన్న రాజీనామా చేశారు. ఆమె రాజీనామా పత్రాన్ని సమర్పించిన సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా కీలక వ్యాఖ్యలు చేశారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఢిల్లీలో పలు ప్రజా సమస్యలపై పదేపదే సూచనలు, హెచ్చరికలు చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం. యమునా నది శాపం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైందని అతిశీతో అన్నట్లుగా సమాచారం.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 48, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యమునా నది కూడా కీలక అంశంగా మారింది. యమునా నదిని ప్రక్షాళన చేస్తామని 2020లో అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే యమునా నది కాలుష్యం తగ్గలేదు. 

ఈ క్రమంలో ఎన్నికలకు ముందు, కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నదిని కుట్రపూరితంగా విషపూరితం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో హర్యానావాసులు ఎక్కువ మంది ఉన్నారు. హర్యానాకు చెందిన 14 మందిని బీజేపీ అభ్యర్థులుగా నిలబెడితే 12 మంది విజయం సాధించారు. హర్యానాతో ఢిల్లీ సరిహద్దు పంచుకున్న 11 స్థానాల్లో బీజేపీ తొమ్మిదింటిని కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News