Vangalapudi Anitha: హోం మంత్రి అనిత మానవత్వం

Minister Anitha helps woman who injured in accident

  • బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన యువతి
  • ఇదే సమయంలో అదే మార్గంలో వెళుతున్న అనిత
  • కాన్వాయ్ ను ఆపించి, యువతికి సపర్యలు చేసిన మంత్రి

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు. వివరాల్లోకి వెళితే... పల్నాడు జిల్లా నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద ఈ ఉదయం బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి గాయపడింది. 

ఇదే సమయంలో అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళుతున్న అనిత దీన్ని గమనించారు. తన కాన్వాయ్ ఆపించి, గాయపడిన యువతి వద్దకు వెళ్లారు. ఆమెకు మంచినీరు అందించి, సపర్యలు చేశారు. ధైర్యం చెప్పారు. అనంతరం మరో వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసి, అక్కడి నుంచి శ్రీశైలంకు బయల్దేరారు.

  • Loading...

More Telugu News