Abids CI: అబిడ్స్ సీఐపై అదనపు కట్నం కేసులో ట్విస్ట్

Abids CI Narasimha Allegations On His Wife

  • భార్యకు అక్రమ సంబంధం ఉందని సీఐ ఆరోపణ
  • ప్రియుడి ద్వారా గర్భం రావడంతో అబార్షన్ చేయించుకుందన్న సీఐ
  • బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు భార్యపై ఆరోపణలు చేసిన సీఐ నరసింహ

అబిడ్స్ సీఐ నరసింహ వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. శనివారం నరసింహపై ఆయన భార్య సిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అదనపు కట్నం కోసం నరసింహ తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ నరసింహ స్పందిస్తూ.. భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. దగ్గరి బంధువులతో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, దానిపై నిలదీయడంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పారు. ఏఆర్ కానిస్టేబుల్ నిమ్మల శ్రీనివాస్, సురేశ్ లతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. సంసారం నాశనమవుతుందని, పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా ఆమె తీరు మార్చుకోలేదన్నారు. ప్రియుడి కారణంగా గర్భం దాల్చిందని, గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకుందని చెప్పారు. 

ఈ వ్యవహారంపై గతంలో ఎస్పీ కార్యాలయంలో పంచాయతీ చేసి భార్యను తెచ్చుకున్నట్లు సీఐ నరసింహ తెలిపారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కూడా తన సంబంధం కొనసాగించిందని, గంటల తరబడి ఫోన్ లో మాట్లాడేదని ఆరోపించారు. పుట్టింటికి వెళ్లిన సమయంలో నకిరేకల్ లో ప్రయివేటు గా ప్రియుడిని కలుసుకునేదని చెప్పారు. ఇవన్నీ తెలిసినా పిల్లల కోసం, కుటుంబం పరువు కోసం ఓపిగ్గా భరించానని నరసింహ తెలిపారు. అక్రమ సంబంధంపై నిలదీస్తే కేసు పెట్టి ఉద్యోగం ఊడగొడతానంటూ బ్లాక్ మెయిల్ చేసిందని నరసింహ ఆరోపించారు.

  • Loading...

More Telugu News