Brahmaji: తెలుగు సినిమాల్లో తెలుగువారిని వెతుక్కోవలసి వస్తోంది: నటుడు బ్రహ్మాజీ

Brahmaji Interview

  • హీరో కావాలని ఇండస్ట్రీకి రాలేదన్న బ్రహ్మాజీ 
  • కెరియర్ పై అసంతృప్తి లేదని వెల్లడి 
  • తనకి ఛాన్సులు రావడానికి అదే కారణమని వివరణ  
  • తనని హర్ట్ చేస్తే మాత్రం ఊరుకోనన్న బ్రహ్మాజీ  




బ్రహ్మాజీ .. డిఫరెంట్ షేడ్స్ చూపించగల నటుడు. సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తున్న ఆయన, ఇప్పటికీ బిజీగానే ఉన్నారు. తాజాగా 'హిట్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "నేను హీరోను కావాలని ఇండస్ట్రీకి రాలేదు. అందువలన నా కెరియర్ విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఒకప్పుడు ఈ పాత్రను ఇతను మాత్రమే చేయగలడు అనుకుని, అతనితో చేయించడానికే ట్రై చేసేవారు. అలాంటి ఆర్టిస్టులు ఇబ్బందులు పెట్టినా భరించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం కాకపోతే మరో నలుగురు ఆర్టిస్టుల పేర్లు ముందుగానే రాసి పెట్టుకుని ఉంటున్నారు" అని అన్నారు. 

" బ్రహ్మాజీ బాగా చేస్తాడు .. సరదాగా ఉంటాడు .. సర్దుకుపోతాడు. ఆయన వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమయానికి వస్తాడు .. నవ్వుకుంటూ వెళతాడు .. అనే ఒక మార్క్ ను నేను సంపాదించుకోవడం వలన, ఇంతకాలం పాటు నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను. దర్శక నిర్మాతలు కూడా నన్ను గౌరవిస్తూనే నాతో వర్క్ చేయించుకున్నారు. నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే ఆ విషయం కూడా అక్కడే చెబుతాను. ఏదో అన్నాడులే అనుకుని నవ్వుతూ తీసుకోను" అని చెప్పారు. 

" ఈ మధ్య కాలంలో నేను ఒక తెలుగు సినిమా చూశాను. ఆ సినిమాలో తెలుగువాళ్లను వెతుక్కోవలసి వచ్చింది. హీరోతో పాటు ముఖ్యమైన పాత్రలను తమిళ .. మలయాళ ..హిందీ ఆర్టిస్టులతో చేయించారు. చిన్నచిన్న పాత్రలను తెలుగువాళ్లతో చేయించారు. అది నాకు చాలా బాధను కలిగించింది. అలాంటప్పుడు ఆ సినిమాను వేరే భాషలో తీసి ఇక్కడ డబ్ చేసుకోవచ్చును గదా అనిపించింది. అందుకే తెలుగువాళ్లకి ఛాన్సులు ఇవ్వండి అంటూ ఇటీవల మాట్లాడటం జరిగింది" అని చెప్పారు. 

More Telugu News