Komatireddy Venkat Reddy: మహా కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy in Maha Kumbh Mela

  • త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి
  • అక్కడి ఘాట్ లో ప్రత్యేక పూజల నిర్వహణ 
  • బడే హనుమాన్ ఆలయంలో మొక్కుల సమర్పణ 

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సాధువులు, సన్యాసులు, సామాన్యులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు.. ఇలా అందరూ ప్రయాగ్ రాజ్ కు క్యూ కడుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లవారుజామున 5.10 గంటలకు పుణ్యస్నానం చేశారు. అనంతరం అక్కడి ఘాట్ లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మొక్కులు సమర్పించారు.

Komatireddy Venkat Reddy
Kumbh Mela
Congress
  • Loading...

More Telugu News