Team India: కటక్ వన్డేలో టీమిండియా ముందు భారీ టార్గెట్

England set huge target to Team India

  • టీమిండియా-ఇంగ్లండ్ రెండో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్

కటక్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు భారీ టార్గెట్ నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జో రూట్ 69, బెన్ డకెట్ 65, లియామ్ లివింగ్ స్టన్ 41, కెప్టెన్ జోస్ బట్లర్ 34, హ్యారీ బ్రూక్ 31, ఫిల్ సాల్ట్ 26 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 3, మహ్మద్ షమీ 1, హర్షిత్ రాణా 1, హార్దిక్ పాండ్యా 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News