Swati Maliwal: కల్కాజీ స్థానంలో గెలిచాక అతిశీ డ్యాన్సులు... సిగ్గులేకపోతే సరి అంటూ స్వాతి మలివాల్ విమర్శలు

- ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరపరాజయం
- ఆప్ అగ్రనేతలకు తప్పని ఓటమి
- కల్కాజీ స్థానం నుంచి గెలిచిన అతిశీ
- కార్యకర్తలతో కలిసి సంబరాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హేమాహేమీలు మట్టికరిచారు. కల్కాజీ స్థానం నుంచి గెలిచిన ముఖ్యమంత్రి అతిశీ మాత్రం సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలతో కలిసి డ్యాన్సులు చేశారు. అతిశీ సెలబ్రేషన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దీనిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ స్పందించారు. ఓవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో కుదేలైతే, అదేమీ పట్టనట్టు అతిశీ సిగ్గులేకుండా డ్యాన్సులు చేస్తున్నారు అంటూ మలివాల్ మండిపడ్డారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్ గురించి తలుచుకుని తీవ్ర వేదనకు గురవుతుంటే, అతిశీకి చీమకుట్టినట్టుగా కూడా లేదని విమర్శించారు.