Team India: రెండో వన్డే: టాస్ గెలిచిన ఇంగ్లండ్... టీమిండియాకు బౌలింగ్

Team India asked to chase in 2nd ODI after England won the toss

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేల సిరీస్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • మోకాలి నొప్పి నుంచి కోలుకుని నేటి మ్యాచ్ లో ఆడుతున్న కోహ్లీ

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో వన్డే జరుగుతోంది. కటక్ లోని బారాబతి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఈ పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 28 పరుగులు. ఓపెనర్లు బెన్ డకెట్ 22, ఫిల్ సాల్ట్ 6 పరుగులతో ఆడుతున్నారు. 

మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడుతుండడం టీమిండియాకు సానుకూలాంశం. కోహ్లీ జట్టులోకి రావడంతో యశస్వి జైస్వాల్ ను తప్పించారు. ఈ మ్యాచ్ ద్వారా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆరంగేట్రం చేస్తున్నాడు.

ఈ సిరీస్ లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించడం తెలిసిందే. ఇవాళ్టి రెండో వన్డే కూడా గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది.

  • Loading...

More Telugu News