tolichowki: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద ఇరువర్గాల ఘర్షణ .. కాల్పుల కలకలం !

clash over land dispute in hyderabad tolichowki no gun fire evidence says police officials

  • కాల్పులు జరిపినట్లు ఆధారాలు లభించలేదన్న పోలీసులు
  • ఇరువర్గాల్లో ఎవరూ ఫిర్యాదులు చేయలేదన్న పోలీసులు
  • విచారణ జరిపి ఘర్షణలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీస్ అధికారి బాలకృష్ణ

భూ వివాదానికి సంబంధించి హైదరాబాద్ టోలిచౌకీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. గోల్కొండకు చెందిన షకీల్ శనివారం రాత్రి కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవపడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియడంతో హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి బాలకృష్ణ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. 

ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాల్పులు జరిగాయన్న సమాచారంతో అక్తర్ వద్ద ఉన్న లైసెన్సు గల తుపాకీని పోలీసులు తనిఖీ చేశారు. కాల్పులు జరిపినట్లు ఎలాంటి అధారాలు లభించలేదని పోలీస్ అధికారి బాలకృష్ణ తెలిపారు. అయితే ఇరువర్గాల్లో ఎవరూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. 

జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని, దీనిని సుమోటోగా తీసుకుని ఘర్షణలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

  • Loading...

More Telugu News