srivari darshan tokens: స్థానిక, ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

- 11వ తేదీ శ్రీవారి దర్శనం కోసం నేడు తిరుపతి స్థానిక భక్తులకు టోకెన్ల పంపిణీ
- ఎన్ఆర్ఐ భక్తుల బ్రేక్ దర్శనాలను పెంపు చేసిన టీటీడీ
- 50 నుంచి 100కు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక (తిరుపతి), ఎన్ఆర్ఐ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి స్థానికులు ఈ నెల 11న తిరుమల శ్రీవారి దర్శనం కోసం 9వ తేదీ (నేడు) తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలు నందు ఈ నెల 9న దర్శన టోకెట్లు జారీ చేయనున్నారు. 4న రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి నెలలో స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారానికి మార్పు చేసిన విషయం విదితమే.
ఇక, తిరుమలకు వచ్చే ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ)కు ఇకపై రోజుకు వంద మంది వీఐపీ దర్శనాలకు అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటి వరకూ రోజుకు 50 మంది ఎన్ఆర్ఐలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనానికి అవకాశం ఉండగా, ఆ సంఖ్యను వందకు పెంచారు. ఎన్ఆర్ఐ భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ తాజా నిర్ణయంతో నిత్యం వంద మంది ఎన్ఆర్ఐలు తమ కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం సులభంగా చేసుకునే అవకాశం లభించింది. టీటీడీ నిర్ణయం పట్ల ఎన్ఆర్ఐ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ టీడీడీకి, పాలకమండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.