Omar Abdullah: మీలో మీరే మరింతగా కొట్టుకొని అంతం చేసుకోండి: ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా

Omar Abdulla on Delhi Assembly results

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
  • 48 స్థానాలు గెలిచిన బీజేపీ, 22 స్థానాలకు పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ
  • కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి ఒమర్ అబ్దుల్లా ట్వీట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి ఓటమిని చవి చూశాయి.

ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. "మీకు నచ్చినట్లుగా మరింతగా కొట్టుకోండి, ఒకరిని ఒకరు అంతం చేసుకోండి" అంటూ చురక అంటించారు. ఆయన ఎక్స్ వేదికగా రెండు పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ మీమ్‌ను జోడించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది.

  • Loading...

More Telugu News