BJP: బీజేపీకి పెరిగిన ఓట్ల శాతమెంత, ఆమ్ ఆద్మీ పార్టీకి తగ్గిందెంత?

How much vote share BJP gained AAP lost

  • ఆమ్ ఆద్మీ పార్టీకి 10 శాతం తగ్గిన ఓట్లు
  • బీజేపీకి పెరిగిన 7 శాతం ఓట్లు
  • ఆమ్ ఆద్మీ పార్టీకి 40 సీట్లు తగ్గి బీజేపీకి పెరిగిన వైనం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే 7 శాతం అధికంగా ఓట్లు సాధించింది. ఫలితంగా ఆ పార్టీ గత ఎన్నికల కంటే 40 సీట్లు అధికంగా గెలుచుకుంది. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకు 10 శాతం క్షీణించడంతో ఆ పార్టీ 40 సీట్లు నష్టపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది.

2015, 2020, 2025 ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. తాజా ఎన్నికల్లో బీజేపీ 45.76 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీ 43.55 శాతం, కాంగ్రెస్ 6.36 శాతం ఓట్లను సాధించాయి.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 38.51 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది ఏడు శాతానికి పైగా పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల శాతం గత ఎన్నికల్లో 53.57 శాతంగా ఉండగా, ప్రస్తుతం దాదాపు పది శాతం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు 2020లో 4.26 శాతంగా ఉండగా, ఈసారి 6.36 శాతానికి పెరిగింది.

  • Loading...

More Telugu News