Narendra Modi: ఢిల్లీ సభలో కార్యకర్త కోసం ప్రసంగాన్ని నిలిపిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో!

- ప్రసంగిస్తుండగా ఒక కార్యకర్త కాస్త అస్వస్థతతో ఉండటాన్ని గమనించిన మోదీ
- ఆ బీజేపీ కార్యకర్తకు మంచి నీళ్లు ఇవ్వాలని సూచన
- బాగానే ఉన్నానని కార్యకర్త చెప్పిన తర్వాతే ప్రసంగాన్ని కొనసాగించిన మోదీ
ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ సభ సందర్భంగా పార్టీ కార్యకర్త ఒకరు కొద్దిగా అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని కాసేపు నిలిపివేశారు. పక్కన ఉన్న వారు ఎవరైనా అతనికి నీళ్లు ఇవ్వండని సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ గెలుపు నేపథ్యంలో ఢిల్లీలో విజయోత్సవ సభను నిర్వహించారు.
తాను ప్రసంగిస్తుండగా, ఒక కార్యకర్త కాస్త అస్వస్థతతో ఉన్నట్లుగా ప్రధాని మోదీ గుర్తించారు. దీంతో తన ప్రసంగాన్ని నిలిపి వేశారు.
"అతను నిద్రపోయాడా? లేక అస్వస్థతకు గురయ్యాడా?... డాక్టర్, అతనిని పరీక్షించండి. దయచేసి ఆ బీజేపీ కార్యకర్తకు నీళ్లు ఇవ్వండి. అతను అస్వస్థతతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అతనిని చూసుకోండి" అని హిందీలో అన్నారు.
తోటి కార్యకర్తలు అతనికి నీళ్లు తాగించారు. ఆ తర్వాత, తాను బాగానే ఉన్నానంటూ ఆ కార్యకర్త సైగ చేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.