Thalakona: ఓటీటీలో అప్సరరాణి అడ్వెంచర్ థ్రిల్లర్!

Thalakona Movie Update

  • గ్లామరస్ పాత్రలతో క్రేజ్ తెచ్చుకున్న  అప్సరరాణి
  • ఆమె ప్రధాన పాత్రగా రూపొందిన 'తలకోన'
  • క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన సినిమా 
  • రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి
 
  


ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ జోనర్ లో రూపొందిన ఒక సినిమా ఈ రోజునే 'అమెజాన్ ప్రైమ్'లో అడుగుపెట్టింది... ఆ సినిమా పేరే 'తలకోన'. టైటిల్ వినగానే ఇది ఫారెస్టు నేపథ్యంలో సాగే కంటెంట్ అనే విషయం అర్థమవుతోంది. అప్సరరాణి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందనే విషయం స్పష్టమవుతోంది. 

క్రితం ఏడాది మార్చి 29వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, సుభాశ్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇతర ముఖ్యమైన పాత్రలలో అజయ్ ఘోష్, అశోక్ కుమార్, విజయ్ రంగరాజు కనిపించనున్నారు. అలాంటి ఈ సినిమా, 99 రూపాయల రెంటల్ చార్జెస్ ను చెల్లించి చూసేలా అందుబాటులోకి వచ్చింది.

కథ విషయానికి వస్తే... సారా ( అప్సరరాణి) తాను అనుకున్నది సాధించడంతో, ఆ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఫారెస్టు ఏరియాలోని రిసార్ట్స్ కి వెళుతుంది. అక్కడ ఒక వ్యక్తితో ఆమెకి గొడవ జరుగుతుంది. అతను డబ్బు, పలుకుబడి ఉన్న ఒక పెద్ద మనిషి కొడుకు. అందువలన అతను 'సారా'ను వెంటాడటం మొదలు పెడతాడు. ఆ అడవి నుంచి... అతని బారి నుంచి ఆమె బయటపడుతుందా లేదా? అనేది ఆసక్తికరం.

  • Loading...

More Telugu News