Ayodhya: అయోధ్య జిల్లా మిల్కీపూర్‌లో బీజేపీ గెలుపు... యూపీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

- సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాస్వాన్ గెలుపు
- 60 వేల పైచిలుకు మెజార్టీతో విజయం
- 2027 ఎన్నికలకు ఇది ట్రైలర్ అన్న ఉప ముఖ్యమంత్రి
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా మిల్కీపూర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. సమీప సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాశ్వాన్ గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్‌పై 60 వేల పైచిలుకు ఓట్లతో పాశ్వాన్ విజయం సాధించారు.
మిల్కీపూర్ విజయంపై ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ విజయం కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు. మొత్తం చిత్రం 2027లో వెల్లడవుతుందన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీ జీరో అవుతుందని జోస్యం చెప్పారు.